డ్రైవర్‌ లేడు.. అయినా బస్సు కదిలింది!

ABN , First Publish Date - 2021-01-19T05:14:17+05:30 IST

తెల్లవారుజాము సమయం 4 గంటలు అవుతోంది. రాపూరు బస్టాండు ఆవరణలో డ్రైవర్‌ బస్సును ఆపాడు. ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి బస్సు స్టార్ట్‌ అయ్యింది.

డ్రైవర్‌ లేడు..  అయినా బస్సు కదిలింది!
ఫిల్లర్‌ను ఢీకొని ఆగిన బస్సు

తెల్లవారుజాము సమయం 4 గంటలు అవుతోంది.  రాపూరు బస్టాండు ఆవరణలో డ్రైవర్‌ బస్సును ఆపాడు. ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి బస్సు స్టార్ట్‌ అయ్యింది. అంతేకాదండోయ్‌.. రయ్‌..మని ముందుకు కదలి బస్టాండులోకి దూసుకొచ్చి, పిల్లర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఇటు ప్రయాణికులను, అటు ఆర్టీసీ సిబ్బందిని కలవరపాటుకు గురిచేసింది. నెల్లూరు-రాజంపేట మధ్య నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సును ఎప్పటిలాగే సోమవారం తెల్లవారుజామున బస్టాండుకు సమీపంలో ఆపారు. ఉన్నట్టుండి బస్సు స్టార్ట్‌ అయి వేగంగా ముందుకు కదిలింది. సుమారు 30 అడుగులు దూరం కదిలిచ్చి బస్టాండు ప్లాట్‌ఫాం మీదకు చేరుకుంది. సిమెంటు పిల్లర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఇది గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది బస్సును వెనుక్కు తీశారు. పొగమంచు దట్టంగా వ్యాపించి నీళ్లు కారుతుండడంతో బస్సులోని ఎలక్ర్టికల్‌ వైర్లలో మంటలు చెలరేగి బస్సు స్టార్ట్‌ అయి ఉండవచ్చని అంటున్నారు. కాగా, బస్సును గ్యారేజీకి తరలించారు.

                              - రాపూరు

Updated Date - 2021-01-19T05:14:17+05:30 IST