ఆముదాలదిన్నెలో పారిశుధ్యం అధ్వానం!

ABN , First Publish Date - 2022-05-25T03:57:52+05:30 IST

కావలి పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆముదాలదిన్నెలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. డ్రైనేజీ కాలువలు కానరావడం లేదు.

ఆముదాలదిన్నెలో పారిశుధ్యం అధ్వానం!
గ్రామంలో ఏర్పాటు చేసుకున్న మురుగు గుంతలు

కానరాని డ్రైనేజీ కాలువలు

ఇళ్ల ముంగిట మురుగు గుంతలు

రోగాల భయంతో వణుకుతున్న ప్రజలు

ప్రబలుతున్న వ్యాధులు, పట్టించుకోని అధికారులు

కావలి రూరల్‌, మే 24: కావలి పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆముదాలదిన్నెలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. డ్రైనేజీ కాలువలు కానరావడం లేదు. దీంతో ఇళ్ల ముంగిట మురికి నీటి గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా మురుగు నీరు పారుతోంది. దీంతో రోగాల భయంతో ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే ప్రబలుతున్న రోగాల సమాచారం తెలిసినా అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పచ్చని పైరుగాలులతో ఆహ్లాదాన్ని పంచే పల్లెలు రోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. మురుగు నీటి గుంటలు దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి గ్రామంలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చెయ్యాలని గ్రామస్థులు కోరుతున్నారు.




Updated Date - 2022-05-25T03:57:52+05:30 IST