పీఆర్‌సీపై అసంతృప్తి పోలేదు: ఆస్కార్‌రావు

ABN , First Publish Date - 2022-06-27T07:56:28+05:30 IST

పీఆర్‌సీపై అసంతృప్తి పోలేదు: ఆస్కార్‌రావు

పీఆర్‌సీపై అసంతృప్తి పోలేదు: ఆస్కార్‌రావు

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 26: ‘‘ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. పీఆర్‌సీ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. జీపీఎఫ్‌, దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వడంలేదని రగిలిపోతున్నారు. ప్రజలకు నవరత్నాలను అమలు చేసే ఉద్యోగుల ను 10వ రత్నంగా చూడాలని కోరుతున్నాం’’ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ రద్దు చేయలేదని విమర్శించారు. ఓపీఎస్‌ కంటే జీపీఎస్‌ మెరుగైనదని చెప్పడంతో దీన్ని అన్ని ఉద్యోగ సంఘాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో ఉన్న ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ చేయాలని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనబాట పడతామని అన్నారు.


Updated Date - 2022-06-27T07:56:28+05:30 IST