రాఫెల్ విమానాల డెలివరీలో ఆలస్యం జరగదు: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-06-03T03:04:10+05:30 IST

భారత వాయుసేన బలం పెంచేందుకు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్ విమానాలు అనుకున్న సమయానికే భారత్‌కు అందుతాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

రాఫెల్ విమానాల డెలివరీలో ఆలస్యం జరగదు: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: భారత వాయుసేన బలం పెంచేందుకు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్ విమానాలు అనుకున్న సమయానికే భారత్‌కు అందుతాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో ఫ్రాన్స్ దేశం హామీ ఇచ్చిందని మంగళవారం ఆయన తెలిపారు. ‘కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినా కూడా అనుకున్న సమయానికే రాఫెల్ విమానాలు అందిస్తామని ప్రాన్స్ హామీ ఇచ్చింది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. ఫ్రాన్స్ సాయుధ బలగాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో రాజ్‌నాథ్ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా కరోనా పరిస్థితులు, ప్రాంతీయ భద్రత, భారత-ఫ్రెంచి ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

Updated Date - 2020-06-03T03:04:10+05:30 IST