లాక్‌డౌన్ పొడిగింపు వార్తలపై పంజాబ్ సీఎం క్లారిటీ

ABN , First Publish Date - 2020-04-09T00:47:01+05:30 IST

పంజాబ్‌లో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వరకూ పొడిగించాలని..

లాక్‌డౌన్ పొడిగింపు వార్తలపై పంజాబ్ సీఎం క్లారిటీ

చండీగడ్: పంజాబ్‌లో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 30వరకూ పొడిగించాలని నిర్ణయించిందని వార్తలు గుప్పుమన్నాయి. పంజాబ్ సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో.. కేంద్రం ఎటూ తేల్చకపోయినప్పటికీ రాష్ట్రాలే స్వయంగా లాక్‌డౌన్ పొడిగింపునకు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ మీడియాలో వార్తలొచ్చాయి.


అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తాజా ప్రకటనతో ఈ వార్తలన్నీ అవాస్తవం అని తేలిపోయింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ పొడిగింపుపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 10న కేబినెట్ సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని ఆయన తెలిపారు. పంజాబ్‌లో కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 106కు చేరింది.

Updated Date - 2020-04-09T00:47:01+05:30 IST