ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చే దమ్ము ఉందా?

ABN , First Publish Date - 2022-04-04T04:25:50+05:30 IST

రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చే దమ్ము ఉందా?
గౌరవ సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

 మాజీ మంత్రి సోమిరెడ్డి

ముత్తుకూరు, ఏప్రిల్‌ 3: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని వల్లూరు పంచాయతీ బండ్లపాళెంలో ఆదివారం నిర్వహించిన గౌరవసభలో ఆయన మాట్లాడుతూ  ధాన్యానికి కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఎంతసేపటికీ తన కుటుంబాన్ని తిట్టడం, పనికిమాలిన ఆరోపణలు చేయడం తప్ప మరో పని లేదన్నారు. గిట్టుబాటు ధర లేక మిల్లర్లు, దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  టీడీపీ హయాంలో రైతుల సమస్యలు తెలుసుకుని. పరిష్కరించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి ఇప్పటికైనా ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామోహ్మహన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బొమ్మి సురేంద్ర, మండల తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జునయాదవ్‌, మాజీ ఎంపీపీ దీనయ్య, నాయకులు ఏకొల్లు కోదండయ్య, కొత్తపల్లి రమేష్‌, అక్కయ్యగారి ఏడుకొండలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-04T04:25:50+05:30 IST