ఢిల్లీలో రికార్డు.. హోం ఐసోలేషన్‌లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు!

ABN , First Publish Date - 2020-07-12T00:16:53+05:30 IST

ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత రెండు వారాలుగా మరణాల సంఖ్య క్రమంగా

ఢిల్లీలో రికార్డు.. హోం ఐసోలేషన్‌లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత రెండు వారాలుగా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఢిల్లీ ప్రభుత్వం అధ్యయనంలో తేలింది. కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు గత 15 రోజుల మరణాలపై అధ్యయనం చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం నగర ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధ్యయనం చేసిన అధికారులు శుక్రవారం నివేదిక అందజేశారు. 


జూన్ 24 నుంచి ఈ నెల 8 మధ్య గత 15 రోజుల వ్యవధిలో ఢిల్లీలో 691 మంది మరణించినట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. అంటే రోజుకు సగటున 46 మరణాలు సంభవించినట్టు నివేదిక పేర్కొంది. అయితే, గత కొన్ని రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జూన్ మధ్యలో అత్యధికంగా 101 మరణాలు నమోదు కాగా, గత పక్షం రోజుల్లో ఇది 46కు తగ్గింది. అలాగే, ఢిల్లీలో మొత్తం మరణాల రేటు 3.64 శాతం నుంచి 3.02 శాతానికి తగ్గింది. అయితే, రోజు వారీ మరణాల రేటు 50 కంటే తక్కువగా నమోదవుతూ సగటు దాదాపు 2.5కు పడిపోయినట్టు నివేదిక వివరించింది. ఈ నెలలో హోం ఐసోలేషన్‌లో ఒక్క కరోనా రోగి కూడా మరణించలేదని నివేదిక వెల్లడించింది.  

Updated Date - 2020-07-12T00:16:53+05:30 IST