Advertisement
Advertisement
Abn logo
Advertisement

హమ్మయ్యా.. ఈ జిల్లాలో రెండ్రోజులుగా Covid మరణాల్లేవ్‌!

చిత్తూరు జిల్లా/తిరుపతి : జిల్లాలో శని, ఆదివారాల నడుమ 24 గంటల్లో 130 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ వ్యవధిలో మరణాలేవీ సంభవించలేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 236284కు చేరింది. 1827 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 24, తిరుపతి రూరల్‌లో 13, చిత్తూరులో 9, శ్రీకాళహస్తిలో 8, పూతలపట్టులో 7, పీలేరు, ఏర్పేడు మండలాల్లో 6 వంతున, చంద్రగిరిలో 5, తవణంపల్లెలో 4, రేణిగుంట, తొట్టంబేడు, కేవీపల్లె, రామచంద్రాపురం, కలికిరి, పలమనేరు మండలాల్లో 3 చొప్పున, నగరి, పుత్తూరు, సదుం, రొంపిచెర్ల, కేవీబీపురం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో 2 వంతున, ఐరాల, కుప్పం, బీఎన్‌ కండ్రిగ, వెదురుకుప్పం, ఎర్రావారిపాళెం, బైరెడ్డిపల్లె, పెనుమూరు, బంగారుపాళ్యం, యాదమరి, నిమ్మనపల్లె, వడమాలపేట, గుడిపాల, గుర్రంకొండ, గంగవరం, విజయపురం, సత్యవేడు, నాగలాపురం, రామసముద్రం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Advertisement
Advertisement