Abn logo
Apr 11 2021 @ 15:21PM

కరోనా కట్టడి లేదు, ఉద్యోగాలు లేవు అంటూ రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ : విమర్శల పరంపరలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్ల కొరత, ఉద్యోగాలు తదితర అంశాల్లో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘దేశంలో కరోనా కట్టడి లేదు. సరిపోయేంత వ్యాక్సీన్లూ లేవు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులు, కార్మికుల ఆవేదనపై దృష్టి సారించడం లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సరిగ్గా లేవు. మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.’’ అంటూ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement