ఈడబ్ల్యూఎస్‌ కోటాలో రాజ్యాంగ ఉల్లంఘన లేదు

ABN , First Publish Date - 2022-09-23T07:43:44+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎ్‌స)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో బలంగా

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో రాజ్యాంగ ఉల్లంఘన లేదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎ్‌స)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో బలంగా సమర్థించుకొంది. జనరల్‌ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ జె.జి.పార్దీవాలాలతో కూడిన ఽఅయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరో రోజు కూడా వాదనలు ఆలకించింది. రిజర్వేషన్ల ఉద్దేశం కొన్ని వర్గాల సామాజిక ఉన్నతికి పరికరంగా ఉండడమే తప్ప ఆర్థికాభివృద్ధి కాదని వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబాటు అన్నది తాత్కాలికమని తెలిపింది. 


Updated Date - 2022-09-23T07:43:44+05:30 IST