ఉపాధి కార్యాలయంలో వసతులు మృగ్యం

ABN , First Publish Date - 2021-08-02T05:57:19+05:30 IST

వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అనే ఉద్దేశంతో నిరుద్యోగులు జిల్లా ఉపాధి కార్యాలయానికి వెళుతుంటారు. అలాగే తరచూ ఈ కార్యాలయంలో జాబ్‌ మేళాలు నిర్వహిస్తుండటంతో వాటికి కూడా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివస్తున్నారు. దీంతో కొంత కాలంగా ఆ కార్యాలయంలో రద్దీ పెరిగింది. అయితే అక్కడికి వెళుతున్న నిరుద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

ఉపాధి కార్యాలయంలో వసతులు మృగ్యం
కూర్చునేందుకు తగినన్ని బల్లలు లేక నిలబడి ఉన్న సందర్శకులు

పెరుగుతున్న సందర్శకులు

కనీస వసతుల కల్పనలో విఫలం

మరుగుదొడ్లు లేక మహిళల కష్టాలు

రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), ఆగస్టు 1 : వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అనే ఉద్దేశంతో నిరుద్యోగులు జిల్లా ఉపాధి కార్యాలయానికి వెళుతుంటారు. అలాగే తరచూ ఈ కార్యాలయంలో జాబ్‌ మేళాలు నిర్వహిస్తుండటంతో వాటికి కూడా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివస్తున్నారు. దీంతో కొంత కాలంగా ఆ కార్యాలయంలో రద్దీ పెరిగింది. అయితే అక్కడికి వెళుతున్న నిరుద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తులు ఇస్తుండటంతో నిత్యం ప్రదక్షిణలు తప్పడం లేదు. దీనికితోడు వచ్చే సందర్శకులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీ రు, కూర్చునేందుకు కుర్చీలు, మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లు చేయకపోవడంతో విజిటర్స్‌కు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు, యువతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదేమిటని ప్రశిస్తే ఉండేది ఒక్కరే కంప్యూటర్‌ ఆపరేటర్‌ అని, మరుగుదొడ్లు మరమ్మతులో ఉన్నాయని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూసి జిల్లా ఉపాధి కార్యాలయంలో పరిస్థితులను మెరుగు పరచాలని కోరుతున్నారు.



Updated Date - 2021-08-02T05:57:19+05:30 IST