cremation: ఛాతీ లోతు వరదనీటిలోనూ మృతదేహానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-08-12T18:17:41+05:30 IST

వాగుపై వంతెన నిర్మించక పోవడంతో ఛాతీ లోతు వరదనీటిలో బంధువులు మృతదేహాన్ని భుజాలపై మోసుకువెళ్లి దహన సంస్కారాలు...

cremation: ఛాతీ లోతు వరదనీటిలోనూ మృతదేహానికి అంత్యక్రియలు

భువనేశ్వర్ (ఒడిశా): వాగుపై వంతెన నిర్మించక పోవడంతో(No bridge) ఛాతీ లోతు వరదనీటిలో బంధువులు మృతదేహాన్ని భుజాలపై మోసుకువెళ్లి దహన సంస్కారాలు(cremation) జరిపిన ఉదంతం ఒడిశా(Odisha) రాష్ట్రంలోని బెహెరాగూడ గ్రామంలో( Odisha villagers) వెలుగుచూసింది.బెహెరాగూడ గ్రామానికి చెందిన శాంతారాణా చాలా కాలంగా పక్షవాతంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల( rains) కారణంగా ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా గోలముండా బ్లాక్‌లోని బెహెరాగూడ గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శాంతా రాణా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి(conducting a funeral this week) వరదనీటిలో బెహెరాగూడ గ్రామ వాసులు చాలా కష్టపడ్డారు.వాగుకు అవతలి వైపు శ్మశాన వాటిక ఉంది.


వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్థులు(no bridge across the stream) ఛాతీ లోతు నీటిలో శవాన్ని మోసుకొని వెళ్లారు.వర్షం కురుస్తుండటంతో మృతదేహం తడవకుండా గ్రామస్థులు అరటి ఆకులను కప్పారు.వరదనీటిలో అంత్యక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని మోసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దహన సంస్కారాల ఖర్చులను భరించలేని నిరుపేదల కోసం ఒడిశా ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం హరిశ్చంద్ర సహాయ యోజన పథకాన్నిప్రారంభించింది. ఈ పథకం కింద మృతుడు శాంతారాణా కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 అందించింది.


Updated Date - 2022-08-12T18:17:41+05:30 IST