బిల్లులు లేవు.. వంట వండేదెట్టా!

ABN , First Publish Date - 2021-11-26T06:49:30+05:30 IST

ప్రభుత్వం పేద పిల్ల లు చదువులకు దూరం కాకూడదనే సదుద్దేశ్యంతో పాఠశా లల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ంది.

బిల్లులు లేవు.. వంట వండేదెట్టా!
బాన్సువాడలో మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తున్న దృశ్యం

బాన్సువాడ టౌన్‌, నవంబరు 25: ప్రభుత్వం పేద పిల్ల లు చదువులకు దూరం కాకూడదనే సదుద్దేశ్యంతో పాఠశా లల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ంది. అందులో భాగంగానే అన్ని పని దినాల్లో పాఠశాల ల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా భోజనం అందిస్తో ంది. బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో విద్యార్థుల హాజరు సంఖ్య పెంచడం, పిల్లల్లో సామాజిక భావన పెంచడం, పౌష్టికాహార లోపాలను తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. అందుకు అనుగు ణంగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందు కు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజ న ఏజెన్సీ నిర్వాహకులు పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. 

జిల్లా వ్యాప్తంగా 1,011 పాఠశాలలు, 94,065 మంది విద్యార్థులు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,011 ప్రభుత్వ పాఠశాలలు ండగా అందులో 697 ప్రాథమిక పాఠశాలలు, 127 ప్రాథ మికోన్నత పాఠశాలలు, 187 ఉన్నత పాఠశాలలు న్నాయి. అన్నీ పాఠశాలలు కలిపి 94,065 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 మంది కార్మికులుండగా వీరందరూ విద్యార్థులకు మధ్యాహ్న భోజ నాన్ని వండి పెడుతున్నారు. అందుకు గాను ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి స్లాబ్‌ రేటు ప్రకారం కార్మికులకు బిల్లులను చెల్లిస్తోంది. 1 నుంచి 5వ తరగతి వరకు 4.35 పైసలు,  6 నుంచి 8వ తరగతి వరకు 6.18 పైసలు, 9 నుంచి 10వ తరగతి వరకు 8.18 పైసలు చొప్పున బిల్లులను చెల్లిస్తోంది. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. కూరగాయలు, పప్పులు, వంటనూనె, కారం, కట్టెలు, గ్యాస్‌ ఇతరత్రా వంట సామగ్రి అంతా కూడా కార్మికులే సమకూ ర్చుకోవాలి. కానీ చేసిన కష్టానికి సకాలంలో బిల్లులు అంద క భోజన ఏజెన్సీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న ధరలు కార్మికుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 3 నెలల నుంచి బిల్లులు అందకపోవడంతో భోజన ఏజెన్సీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


నగలు తాకట్టు పెట్టి వడ్డిస్తున్నాం

బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందక అవస్థలు పడతారనే ఉద్దేశ్యంతో భోజన ఏజెన్సీ కార్మికులు తమ నగలు తాకట్టు పెట్టి మరీ భోజనం వండి పెడుతున్నారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేక అప్పుల పాల వుతున్నామని, వంట చెరుకు, గ్యాస్‌ ధరలు సైతం పెరుగు తుండడంతో తమపై ఆర్థిక భారం పడుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన సరుకులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వ్యాపారులు మరుసటి నెలకు అవసరమయ్యే సామగ్రి ఇవ్వడం లేదు. చేసేదేమి లేక కార్మికులు పిల్లలను పస్తులు ఉంచలేక అప్పులు చేసి భోజనంవండి పెడుతున్నారంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


భారంగా మారిన గుడ్డు..

మెనూ ప్రకారం ప్రతీ వారంలో విద్యార్థులకు 3 సార్లు గుడ్డును అందించాలి. ప్రస్తుతం గుడ్ల ధరలకు రెక్కలు రావడంతో భోజన ఏజెన్సీ కార్మికులు ఆర్థికంగా సతమతమ వుతున్నారు. గుడ్డు ధర 4.50 నుంచి 5 రూపాయల వరకు పలుకుతోంది. అప్పులు చేసి గుడ్లు కొంటే వాటి బిల్లుల చెల్లింపుల జాప్యంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో మగ్గి పోతున్నారు. గుడ్లకు బదులుగా అరటి పండ్లను అందిస్తున్నారు. 


భగ్గుమంటున్న కూరగాయల ధరలు

భోజన ఏజెన్సీ కార్మికులకు కూరగాయల ధరలు భగ్గుమంటుండడంతో ఆందోళను గురవుతున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా కిలోకు రూ.80 నుంచి 120 పలుకుతోంది. ఆకు కూరల ధరలు కూడా అమాంతంగా పెరగాయి. తప్పని పరిస్థితుల్లో జేబులకు చిల్లులు పడినా విద్యార్థుల కోసం వంట వండిపెడుతున్నారు.


భోజన ఏజెన్సీ కార్మికుల డిమాండ్లు ఇవే..

ఫ కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి

ఫ వంట సరకులను కూడా సరఫరా చేయాలి

ఫ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

ఫ ఉద్యోగ భద్రత కల్పించాలి

ఫ పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కార్మికులకు ఉన్న బకా యిలను చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా కాలం తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభ మై రెండు, మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు అందలేదని, జీతాలు కూడా మూడు నెలలుగా చెల్లించలేదని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం సకాలంలో బిల్లులు చెల్లించాలని, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించాలని కార్మికులు వేడుకుంటున్నా రు. బిల్లులు చెల్లించని పక్షంలో భోజన ఏజెన్సీ కార్మికులు ఆందోళన బాట పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


బిల్లులు చెల్లించండి సారూ..

ఫ జమునాబాయి, భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు

భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరుతున్నా. బిల్లులు అందక అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాం. దుకాణదారులు సరకులు ఇవ్వడం లేదు. చాలా కష్టంగా నెట్టుకొస్తున్నాం. వంట సామగ్రి కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తే బాగుంటుంది.


కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలి

ఫ జె. రవీందర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

ప్రభుత్వం భోజన ఏజెన్సీ కార్మికులకు కనీస వేతనం రూ.18,000 అందజేయా లి. ప్రస్తుతం రూ.1000 మాత్రమే అంది స్తోంది. అవి కూడా సకాలంలో చెల్లించ డం లేదు. కార్మికులకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. అంగన్‌వాడీలకు సరకుల సరఫరా చేసినట్లే భోజన ఏజెన్సీ కార్మికులకు కూడా సరుకులను సరఫరా చేయాలి.

Updated Date - 2021-11-26T06:49:30+05:30 IST