పండగ పూట పస్తులేనా?

ABN , First Publish Date - 2021-10-09T04:45:54+05:30 IST

పండగ పూట పస్తులేనా?

పండగ పూట పస్తులేనా?

దసరా వేళ దక్కని ఆసరా

ఖమ్మం జిల్లాలో 17,333మంది లబ్ధిదారులు 

ఐకేపీ ఉద్యోగులకు అందని వేతనాలు

ఖమ్మంసంక్షేమవిభాగం, అక్టోబరు 8: ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న అభాగ్యులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారికి ప్రభుత్వం ఆసరాతో ఆదుకుంటోంది. ప్రతీ నెల వారికి మొదటి వారంలో ఆసరా ఫించన్లు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఒక్కోసారి మూడు నెలల వరకు ఆసరా పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఈనెలలో రావాల్సిన ఆసరా ఫించన్లు మాత్రం ఇంకా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు రాలేదు. మరో రెండు రోజులు వరస సెలవులు వచ్చాయి. దీంతో దసరా వరకైనా ఆసరా వస్తుందని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

పింఛను జాప్యమైతే బెంగే..

ఆసరా ఫించన్లు ప్రతి నెల జమ జరిగాయంటే ఆ నెలలో మొదటి 20రోజుల వరకు లబ్ధిదారులు ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు మందుల నుంచి ఇంటి విద్యుత్‌ బిల్లు, కిరాణం సరుకులు, పాల బిల్లు ఇలా  నిత్యవసరాలకు వందల సంఖ్యలో ఆసరా ఫించన్లు కోసం లబ్ధిదారుల కుటుంబాలు ఎదురుచూస్తుంటాయి. నిత్యావసరాల ఖర్చులు పోను మిగిలిన డబ్బును జాగ్రత్తగా అత్యవసరాలకు దాచుకుంటారు. ఉద్యోగుల వేతనాల కంటే ఆసరా లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అలాంటి పింఛను రావడంలో జాప్యం జరగడంతో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో ఆసరా సొమ్ము రూ.34కోట్లు 

ఖమ్మం జిల్లాలో 17,333మంది ఆసరా లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధులు 3,269, వితంతువులు 7,978, దివ్యాంగులు 4,584, గీత కార్మికులు 277, చెనేత కార్మికులు 26, ఒంటరి మహిళలు 348, పైలేరియా బాధితులు 198, హెచ్‌ఐవీ బాధితులు 348మంది వరకు పింఛన్లు పొందుతున్నారు. వీర్కికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.34,38,52,032ఖర్చు చేస్తోంది. 

సెర్ప్‌ ఉద్యోగులకు అందని వేతనాలు

ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కారణంగా మొదటి వారంలో రోజుకు కొన్ని జిల్లాల చోప్పున కేటాయిస్తూ వేతనాలను జమ చేస్తోంది. అయితే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సుమారు 750మంది సెర్ప్‌ ఉద్యోగుల ఖమ్మం జిల్లాలో గ్రామ సమా ఖ్యల నుంచి జిల్లా సమాఖ్యల వరకు బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. జిల్లాలో రెగ్యులర్‌ ఉద్యోగులకు శుక్రవారం వేతనాలు అందాయి. కాని సెర్ప్‌ ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందలేదు. మరో రెండు రోజులు వరస సెలవులు రావటంతో ఈసారి దసరాకు వేతనాలు అందు తాయోలేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజూ దండం పెడుతున్నా

చింతపల్లి మల్లమ్మ, వృద్ధాప్య పింఛన్‌ లబ్ధిదారు, బల్లేపల్లి, ఖమ్మం

నేను ఏ పనిచేయలేను, ఆసరా పింఛనుపైనే ఆధార పడ్డా. ప్రతి నెల రూ.2000 ఇస్తారు. నెలకు రూ.1500 మందులకు పోను మరో రూ.500 ఇతర ఖర్చుల కోసం జాగ్రత్తగా వాడుకుంటా. కానీ ఈ నెల పింఛను ఇంకా రాలేదు. ఫించన్‌ పడితే పండక్కి చీర తీసుకుందా మనుకున్న. దాని కోసం రోజూ దండం పెట్టుకుం టున్నా. కిరాణా కొట్టులో పండక్కి తీనేయి తీసుకుందామనుకున్నా.. కానీ పైసలు పడలేదని ఎదురు చూస్తున్నా.

Updated Date - 2021-10-09T04:45:54+05:30 IST