నో ఎగ్జామ్స్ .. జగన్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-26T20:57:38+05:30 IST

విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా

నో ఎగ్జామ్స్ .. జగన్ కీలక నిర్ణయం

అమరావతి: విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించేందుకు అవకాశాలు లేకపోవడంతో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులను పైక్లాసులకు ప్రమోట్‌ చేయాలని ఆదేశించారు. వాలంటీర్ల సాయంతో విద్యార్థులకు నేరుగా డ్రైరేషన్‌ ఇవ్వాలని సీఎం సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాఠశాలలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది. పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకుండా పైక్లాసులకు ప్రమోట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. మధ్యాహ్న భోజనం అన్నిచోట్ల ఒకే క్వాలిటీ ఉండాలని, ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని జగన్ ఆదేశించారు.


తమిళనాడులో కూడా 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులందర్నీ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులు చేస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా పాఠశాలలను మూసివేసిన నేపథ్యంలో ఈ ఏడాదికి పరీక్షలు లేకుండా 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేయాలని తల్లిదండ్రులు, ఉపాద్యాయుల సంఘం తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఆల్‌పాస్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.




Updated Date - 2020-03-26T20:57:38+05:30 IST