ప్రైవేట్‌ స్కూళ్లను పట్టించుకోరా

ABN , First Publish Date - 2022-09-03T04:55:12+05:30 IST

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో బలహీనవర్గాల కుటుం బాల పిల్లలకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ విధానం లో ఒకటో తరగతి లోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తామంటూ విద్యా శాఖ చేసిన హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో అడ్మిషన్లపై అడుగు ముందుకు పడలేదు.

ప్రైవేట్‌ స్కూళ్లను పట్టించుకోరా

25 శాతం అడ్మిషన్లు ఎక్కడ?

మౌనం దాల్చిన జిల్లా విద్యా శాఖ 

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 2 : ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో బలహీనవర్గాల కుటుం బాల పిల్లలకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ విధానం లో ఒకటో తరగతి లోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తామంటూ విద్యా శాఖ చేసిన హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో అడ్మిషన్లపై అడుగు ముందుకు పడలేదు. విద్యాహక్కు చట్టం, ఉచిత నిర్బంధ విద్య రూల్స్‌–2010 ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశిస్తూ విద్యా శాఖ నిర్ణయించింది. ఆ మేరకు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విస్తృత ప్రచారం చేసుంటే నిర్దేశిత వర్గాల పిల్లలకు ప్రయోజనం చేకూరేది. దీనికి భిన్నంగా రాష్ట్ర అధికారులు నిదానంగా స్పందించి జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు 11న తాపీగా ప్రకటన ఇవ్వగా, అప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులకుపైగా గడిచిపోవడం, విద్యార్థులు పాఠశాలల్లో చేరిపోవడం, తరగతులు జరిగిపోతుం డటం జరిగాయి. అడ్మిషన్ల ప్రక్రియను గత నెల 16న సీఎస్‌ఈ పోర్టల్‌ ద్వారా ప్రారంభించి, అదే నెల 26 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. లాట రీ పద్ధతిలో అడ్మిషన్లకు విద్యార్థుల ఎంపికను 30న పూర్తి చేసి, ఎంపికైన విద్యార్థుల జాబి తాను ఈ నెల 2న అంటే శుక్రవారం విడుదల చేయడం తోపాటు, అడ్మిషన్‌ ఖరారైన ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ర్థులు రిపోర్ట్‌ చేయా లి. మిగిలిన సీట్లకు రెండో జాబితా ప్రక్రి య ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు జరగాలి. అయితే జిల్లాలో శుక్రవారం వరకు 25 శాతం ఉచిత ప్రవేశాలపై ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.

పట్టించుకునేవారే లేరు

ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ రంగంలో మొత్తం 1,003 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రాథమిక పాఠశాలలు 205 ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి సగటున ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతిస్తుందని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 25 శాతం సీట్లను నిబంధనల ప్రకారం బలహీన వర్గాల పిల్లలకు కేటాయిస్తే జిల్లాలో రెండు వేలకు పైగా ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలి. అయితే ఒక్కో ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఎంత మంది పిల్లలకు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఈ అడ్మిషన్ల గురించి ఎటువంటి సమాచారం విద్యా శాఖ వద్ద లేదు. కేవలం పాఠశాల విద్య ఉన్నతాధికారులు జిల్లాకు పంపిన అడ్మిషన్ల ప్రకటనను పత్రికలకు పంపడంతోనే చేతులు దులుపుకుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రవేశాలకు జిల్లా నుంచి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నదీ తెలియాలంటే సీఎస్‌ఈ లాగిన్‌ ఇస్తేనే తెలుస్తాయని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తొలివిడత అడ్మిషన్లను జిల్లాలో పర్యవేక్షించేందుకు సీఎస్‌ఈ ఏర్పాటు చేయాల్సిన జిల్లా అడ్మిషన్ల మోనటరింగ్‌ కమిటీ(డీఏఎంసీ) ఊసే ఇంత వరకు లేకపోవడం గమనార్హం. ఇక దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన సీఎస్‌ఈ పోర్టల్‌ కొన్ని రోజులపాటు తెరచుకోలేదని కూడా వార్తలు వచ్చాయి. 

హైకోర్టు హెచ్చరించినా..

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తర గతిలో 25 శాతం సీట్లకు విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు కల్పించడంలో జరిగిన జాప్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టు విద్యాశాఖ ఉన్నతాధికారులను తీవ్రస్థాయిలో మందిలించడంతోపాటు, హెచ్చరికలను జారీచేసిన విషయం విదితమే. కోర్టు సీరియస్‌గా తీసుకున్నా శుక్రవారానికి జిల్లాలో ఎటువంటి కదలికలు లేవు. ఫలితంగా గ్రామీణ ప్రాంత బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భావిస్తున్నారు. 


Updated Date - 2022-09-03T04:55:12+05:30 IST