అడ్డూ లేదు.. అదుపు లేదు

ABN , First Publish Date - 2022-05-26T07:01:39+05:30 IST

జిల్లాలో ఇసుక తవ్వకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. క్వారీలకు అనుమతులు ఇవ్వకున్నా మంజీరా నది పరివాహక వాగుల వెంట ఇసుక తవ్వకాలను చేస్తున్నారు. రాత్రివేళల్లో ఇసుకను తరలించి ఇతర ప్రాంతాల్లో డంపులు చేస్తున్నారు.

అడ్డూ లేదు.. అదుపు లేదు
హంగర్గ వద్ద వాగులో జోరుగా ఇసుక తవ్వకాలిలా..

జిల్లాలో జోరుగా కొనసాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు 

మంజీరా, పులాంగ్‌, కప్పలవాగు, పెద్దవాగు వెంట నిత్యకృత్యం

రెండు రోజులు అనుమతి ఇస్తే.. వారం మొత్తం అదే పనిగా తవ్వకాలు 

రాత్రివేళల్లో ఇసుకను తరలిస్తూ.. ఇతర ప్రాంతాల్లో డంపులు

నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌తో పాటు హైదరాబాద్‌ ప్రాంతాలకు ఇసుక

ఒకవైపు ఇసుక రవాణా జరుగుతున్నా.. మరోవైపు పట్టించుకోని అధికారులు

అనుమతుల పేరిట ఎక్కువ మొత్తంలో తవ్వకాలు

దండుకుంటున్న ఇసుక వ్యాపారులు

మంజీరా నదీ పరివాహక గ్రామాల్లో వట్టిపోతున్న బోరుబావులు

నిజామాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఇసుక తవ్వకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. క్వారీలకు అనుమతులు ఇవ్వకున్నా మంజీరా నది పరివాహక వాగుల వెంట ఇసుక తవ్వకాలను చేస్తున్నారు. రాత్రివేళల్లో ఇసుకను తరలించి ఇతర ప్రాంతాల్లో డంపులు చేస్తున్నారు. అవసరమైన వారికి నేరుగా తరలించి అమ్మ కాలను చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలస్థాయిలోని అధికారులకు తెలిసి నా.. పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం లేదు. ప్రభుత్వ పథకాలకు వారంలో రెండు రోజులు అనుమతులు ఇస్తున్నా.. మిగతా రోజుల్లో అనధికారికంగా తవ్వకాలను చేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఎక్కడైనా అ ధికారి అడ్డుకుంటే తమకున్న పరపతిని ఉపయోగించి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిళ్లు తెస్తూ తప్పించుకుంటున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఉన్నా.. తమ శాఖల పరిధి కాదని తప్పించుకుంటున్నారు. 

తవ్వకాలకు అనుమతులు లేవు

 జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు క్వారీలను కేటాయించనే లేదు. కేవలం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రోడ్లు, ప్రాజెక్టుల పనుల కోసం మాత్రమే ఇసుక తవ్వకాలకు ఆయా మండలాల పరిధిలో అనుమతులు ఇస్తున్నారు. వారంలో బుధ, శుక్రవారాలలో స్థానిక తహసీల్దార్లు ఈ అనుమతులను మంజూరు చేస్తున్నారు. జిల్లాలోని మంజీరా, పులాం గ్‌, పెద్దవాగు, కప్పలవాగు వెంట మాత్రమే తవ్వకాలకు అనుమతులను మం జూరు చేస్తున్నారు. ఈ తవ్వకాలకు అనుమతి ఇస్తూనే లారీలు, టిప్పర్లకు బదు లు ట్రాక్టర్లలో ఇసుక తరలించాలని కోరుతున్నారు. ఆయా క్వారీల పరిధిలో అ వసరం మేరకు మాత్రమే వే బిల్లులను ఇస్తున్నారు. ఇదే ఆసరా చేసుకుని ఎక్కువ మొత్తంలో ఇసుక తవ్వకాలను చేస్తున్నారు. ఆ వే బిల్లులను చూపెడు తూ వారం మొత్తం ఇసుకను తరలిస్తున్నారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ తో పాటు హైదరాబాద్‌ ప్రాంతాలకు రాత్రివేళల్లో తరలిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ధరలకు ఇసుక అమ్మకాలు చేస్తున్నారు.

మంజీరా వెంట ఎక్కువ మొత్తంలో..

జిల్లాలో మంజీర నది వెంట ఎక్కువగా తవ్వకాలను చేస్తున్నారు. కోటగిరి, బోధన్‌ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ అనుమతులను ఇస్తున్నారు. మంజీరాకు అటువైపున మహారాష్ట్ర ప్రభుత్వం 11 క్వారీల కు అనుమతులు ఇచ్చింది. అదేరీతిలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు జిల్లా అధికారులు అనుమతులు ఇవ్వడంతో మంజీరా వెంట ఎక్కువ మొత్తంలో ఇసుక త వ్వకాలను చేస్తున్నారు. పగటిపూటనే కాకుండా.. రాత్రివేళల్లోనూ పొక్లెయినర్‌ల ను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. లారీలు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. కోటగిరి, బోధన్‌ మండలాల పరిధిలో మంజీరాలో తవ్వకాలు చేస్తూ పలు దార్లగుండా నిజామాబాద్‌కు తరలిస్తున్నారు. బోధన్‌ పరిధిలో కూడా కొ న్నిచోట్ల డంపులలో ఇసుక నిలుపుతున్నారు. భవన నిర్మాణంతో పాటు ఇతర అ వసరాలకు సరఫరా చేస్తున్నారు. లారీ ఇసుకను రూ.20 వేల వరకు అమ్ముతున్నారు. ఈ ఇసుక రవాణా ఎక్కువగా రాత్రివేళల్లో రెంజల్‌, నవీపేట మీదుగా తరలిస్తున్నారు. రాత్రివేళల్లో పలుచోట్ల నుంచి ఇసుక రవాణా అవుతున్నా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ, ఇరిగేషన్‌, గనులు భూగర్భశాఖ, రవాణాశాఖ అధికారులు ప్రతీరోజు తనిఖీలు చేయకపోవడం వల్ల భారీ ఎత్తున తరలిస్తున్నారు. కిందిస్థాయి అధికారులతో సమన్వయం ఉండడంతో ఎక్కడా, ఎవరూ పట్టుకోకపోవడం గమనార్హం. కొన్నిచోట్ల పోలీసులు పట్టుకున్నా.. ఫోన్లు వస్తుండడంతో వెంటనే వదిలివేస్తున్నారు. కొద్దిపాటి వాహనాలను మాత్రమే జరిమానాలు విధిస్తున్నారు. ఆయా మండలస్థాయిలో ఇసుక వ్యాపారులు రింగ్‌గా ఏర్పడి తరలించడంతో పాటు స్థానిక నేతలు, అధికారులకు దగ్గరగా ఉండి మరీ వారి అవసరాలను తీరుస్తుండడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు.

పగటి పూటైనా పట్టించుకోరు

జిల్లాలో మంజీరాతో పాటు పెద్దవాటు, కప్పలవాగు, పులాంగ్‌వాగులలో ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నాయి. పులాంగ్‌వాగు వెంట పగటిపూటనే తవ్వకాలు జరుగుతున్నా.. మాక్లూర్‌, నవీపేట మండలాల పరిధిలోని అధికారులు పట్టించుకోవడం లేదు. కప్పలవాగు, పెద్దవాగు పరిధిలో నిత్యం టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలుతున్నా.. ఆ వైపు అధికారులు చూడడం లేదు. ఒకవేళ ఎవరైనా పట్టుకున్నా ఒత్తిళ్లు రావడంతో వదిలివేస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోవడం వల్ల మంజీరా నదితోపాటు వాగుల్లో భారీ ఎత్తున తోడడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇసుక ఎక్కువగా తవ్వకాలు చేయడం వల్ల పక్కనే ఉన్న గ్రామాల్లో బోర్లు కూడా వట్టిపోతున్నాయి. జిల్లాలోని ఉన్నతాధికారులు ఇసుక అక్రమరవాణాపై దృష్టిపెట్టి అరికడితే రవాణా ఆగే అవకాశం ఉంది.

ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడం లేవు

: సత్యనారాయణ, జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి

జిల్లాలో ఇసుక క్వారీలకు ఎలాంటి అనుమతులను ఇవ్వడం లేదు.  ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి పనుల కోసం స్థానిక తహసీల్దారులే అనుమతులను ఇస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖ అధికారులతో కలిసి అడ్డుకుంటున్నాం. పలు వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేశాం. 

Updated Date - 2022-05-26T07:01:39+05:30 IST