హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను మళ్లీ పెంచింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. లంప్ రకం ఖనిజం ధరను టన్నుకు రూ.100, ఫైన్స్ రకం ధరను రూ.200 సవరించింది. దీంతో టన్ను లంప్ ఖనిజం ధర రూ.6,100కు, ఫైన్స్ ధర రూ.5,160 చేరుతుందని ఎన్ఎండీసీ వెల్లడించింది. దీనికి రాయల్టీ, సెస్, ఫారెస్ట్ పర్మిట్ ఫీజు అదనం. కాగా గత నెల 8న ఇనుప ఖనిజం ధరలను కంపెనీ పెంచింది.
ఉత్పత్తి, విక్రయాల్లో రికార్డు: ఎన్ఎండీసీ.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 4.21 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. 4.07 కోట్ల టన్నులను విక్రయించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఉత్పత్తి 23ు, విక్రయాలు 22 శాతం పెరిగాయని పేర్కొంది. ఇది కంపెనీ వార్షిక ఉత్ప త్తి, విక్రయాల్లో రికార్డు ఎన్ఎండీసీ వెల్లడించింది.