ఎస్‌ఐల బదిలీ

ABN , First Publish Date - 2020-11-01T11:24:49+05:30 IST

జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీచేస్తూ శనివారం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్‌ఐల బదిలీ

నెల్లూరు(క్రైం), అక్టోబరు 31: జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీచేస్తూ శనివారం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దర్గామిట్ట పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ కె. వేణుగోపాల్‌ను దగదర్తికి, దగదర్తి ఎస్‌ఐ జి. సుబ్బారావును వీఆర్‌కు, సీసీఎస్‌లోని ఎస్‌కె సుభానీని ఏఎస్‌పేటకు, ఏఎస్‌పేట ఎస్‌ఐ బి. గోపాల్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న కె. శ్రీనివాసరావును డీసీఆర్‌బీకి, నార్త్‌ ట్రాఫిక్‌లో ఉన్న ఎం. మనోజ్‌కుమార్‌ను శ్రీహరికోట పీఎస్‌కు, సీసీఎస్‌లో ఉన్న ఎం. బాజీని చిల్లకూరుకు, వీఆర్‌లో ఉన్న ఎన్‌. సుబ్బారావు, ఎం. తిరుపతయ్యలను సీసీఎస్‌కు, దిశ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ కె. రోజాలతను వీఆర్‌కు బదిలీ చేశారు.

Updated Date - 2020-11-01T11:24:49+05:30 IST