అమరుల త్యాగాలు వృథా కాకూడదు

ABN , First Publish Date - 2020-10-30T11:01:55+05:30 IST

నిత్యం ప్రజా పోరాటాలు చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి అమరులైన నేతల త్యాగాలు వృఽథా కాకూడదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జల్లి విల్సన్‌, ఆవుల శేఖర్‌ అన్నారు.

అమరుల త్యాగాలు వృథా కాకూడదు

 వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విల్సన్‌


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 29 : నిత్యం ప్రజా పోరాటాలు చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి అమరులైన నేతల త్యాగాలు వృఽథా కాకూడదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జల్లి విల్సన్‌, ఆవుల శేఖర్‌ అన్నారు. ఇటీవల మృతిచెందిన వామపక్ష నేతల సంతాప సభ నెల్లూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగింది. ఆ నేతల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ప్రస్తుత ప్రభుత్వం బలవంతంగా లాక్కుని పార్టీ కార్యకర్తలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలా కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు.


ప్రజా, దళిత వ్యతిరేక విధానాలను ఎజెండాగా పెట్టుకున్న అధికార పార్టీ కుయుక్తులను  తిప్పికొడతామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా భూముల పంపిణీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌,  నాయకులు పముజుల దశరథరామయ్య, రామరాజు, అరిగెల సాయి, మాదాల వెంకటేశ్వర్లు, దర్గాబాబు, బాలక్రిష్ణయ్య, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:01:55+05:30 IST