సిలికా గనులపై తనిఖీలు

ABN , First Publish Date - 2020-10-28T10:51:07+05:30 IST

: జిల్లాలోని చిల్లకూరు, కోట ప్రాంతాల్లో ఉన్న సిలికా గనుల నిర్వహణ తీరును, స్టాక్‌ పాయింట్లను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాద్‌ మంగళవారం తనిఖీ చేశారు.

సిలికా గనులపై తనిఖీలు

నెల్లూరు(వెంకటేశ్వరపురం), అక్టోబరు 27 : జిల్లాలోని చిల్లకూరు, కోట ప్రాంతాల్లో ఉన్న సిలికా గనుల నిర్వహణ తీరును, స్టాక్‌ పాయింట్లను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాద్‌ మంగళవారం తనిఖీ చేశారు. జిల్లా శాండ్‌ అధికారి వంశీధర్‌రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లోని  సిలికా శాండ్‌ను పరిశీలించారు. అనంతనం వెంకటాచలం ఇసుక స్టాక్‌యార్డ్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. బుక్‌ చేసుకున్న వెంటనే ఇసుక ప్రజలకు చేరేలా చూడాలని సిబ్బందికి సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

Updated Date - 2020-10-28T10:51:07+05:30 IST