రైతు భరోసాతో 2.26 లక్షల మందికి లబ్ధి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-28T10:43:20+05:30 IST

రైతు భరోసా పథకం రెండో విడత ద్వారా జిల్లాలో 2,26,060 మంది రైతులకు రూ.46.74 కోట్లు అందిందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పారు.

రైతు భరోసాతో 2.26 లక్షల మందికి లబ్ధి : కలెక్టర్‌

నెల్లూరు:  రైతు భరోసా పథకం రెండో విడత ద్వారా జిల్లాలో 2,26,060 మంది రైతులకు రూ.46.74 కోట్లు అందిందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండో విడత రైతు భరోసా నగదు చెల్లింపులను అమరావతి నుంచి ప్రారంభించారు. నెల్లూరులోని జిల్లా ఎమర్జెన్సీ కేంద్రం నుంచి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి కలెక్టర్‌ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతు భరోసా రెండు విడతల్లో కలిపి రూ.170.38 కోట్లను ప్రభుత్వం అందించిందన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాల వల్ల పంటలు నష్టపోయిన 4946 మంది రైతులకు ప్రభుత్వం రూ.4.99 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించిందన్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జేసీ హరేందిర ప్రసాద్‌, వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌,  విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T10:43:20+05:30 IST