ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-09-23T09:25:53+05:30 IST

సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని మాదిగ ఉద్యోగ సమాఖ్య వెంకటగిరి నియోజకవర్గ సమ

ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి

డక్కిలి, సెప్టెంబరు 22 : సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణను  తక్షణమే అమలు చేయాలని మాదిగ ఉద్యోగ సమాఖ్య వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త దూడల పెంచలయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన   విలేకరులతో మాట్లాడారు.\


ఎస్సీల ఏ,బీ,సీ,డీ గ్రూపుల వర్గీకరణ డిమాండ్‌ సరైనదేనని, అప్పుడు ప్రతిపక్ష హోదాలో వున్న వైఎస్‌ జగన్‌ చెప్పారన్నారు. ప్రస్తుతం అదికారంలో వున్న జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.  ఎస్సీ వర్గీకరణ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు మాదిగలను నమ్మించి మోసం చేశారని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-09-23T09:25:53+05:30 IST