floods: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-11T16:10:02+05:30 IST

floods: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

floods: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

కామారెడ్డి: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం (Rain) కురుస్తోంది. వాగులు పొంగి పొర్లడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ (Nizamsagar Project)కు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 16వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 14,400 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. నిజాంసాగర్ పూర్తి నీటిమట్టం 1405 అడుగులు, ప్రస్తుతం 1404 అడుగుల వరకు నీరు ఉంది. నిజాంసాగర్ పూర్తి నీటినిల్వ 17.80టీఎంసీలు, ప్రస్తుతం 16.35టీఎంసీలున్నాయి. 


మరోవైపు శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (Sri Ramasagar Project)కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాతో పాటు ఎగు వ ప్రాంతంలో వర్షాలు పడుతుండడంతో ఈ వరద ప్రభావం కొనసాగుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టుల గేట్లను తెరచి దిగువకు విడుదల చేస్తుండం వల్ల ఈ వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 39680 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి నాగులు గేట్ల ద్వారా 16656 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2022-08-11T16:10:02+05:30 IST