నిజామాబాద్: జిల్లాలోని భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతి అంత్యక్రియలకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్యను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అటు బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన రద్దు అయ్యింది. సరస్వతి అంత్యక్రియలు జరిగే బాబాపూర్ గ్రామంలో ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి