పసుపు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలం

ABN , First Publish Date - 2020-02-20T09:21:23+05:30 IST

నిజామాబాద్‌ మార్కె ట్‌లో పసుపు కొనుగోళ్లలో అంతా వ్యాపారు ల మాయాజాలమే కొనసాగుతోంది. ఉత్ప త్తి, విస్తీర్ణంపై అంచనా వేసిన వారు ఎగు మతి, జాతీయ అమ్మకాలను

పసుపు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్‌ మార్కె ట్‌లో పసుపు కొనుగోళ్లలో అంతా వ్యాపారు ల మాయాజాలమే కొనసాగుతోంది. ఉత్ప త్తి, విస్తీర్ణంపై అంచనా వేసిన వారు ఎగు మతి, జాతీయ అమ్మకాలను దృష్టిలో పె ట్టుకుని మార్కెట్‌లో ధరలు నిర్ణయిస్తున్నా రు. మార్కెట్‌కు వచ్చిన పసుపును కొనుగో లు చేస్తున్నారు. ఏ పంటకైనా మాత్రం గడి చిన నాలుగేళ్లుగా ధర తగ్గుతోంది.  ఈయే ఏడాది కనిష్ఠ స్థాయికి చేరింది. ఇతర ప్రా ంతాల నుంచి వ్యాపారులు రాకపోవడం, ఇక్కడి  వారే కొనుగోలు చేయడం, ఈ-నా మ్‌ ఉన్నా ఇతర మార్కెట్లకకు అనుసంధా నం చేయకపోవడం వల్ల వ్యాపారులు పె ట్టిందే ధరగా మారుతోంది. కమీషన్‌ ఏజం ట్లు ఉన్న వ్యాపారులు లక్ష్యాలకు అనుగు ణంగానే కొనుగోలు జరుగుతుండడంతో వె రసి రైతులు భారీగా నష్టపోతున్నారు. అ ప్పుల పాలు అవుతున్నారు. నైజాం కాలం నుంచి జిల్లాలోని రైతులు పసుపు పండిస్తో న్నా ఎప్పుడు ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదు ర్కొనలేదు. గడిచిన నాలుగేళ్లలో పసుపు ధరలు పరిశీలించినా ఎప్పుడు ఈ పరిస్థితి లే దు. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీతో పాటు రాష్ట్రంలో పసుపు విస్తీర్ణం పెరగడంతో దా నిని వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తమకు నచ్చిన ధర లనే పసుపుకు పెట్టి కొనుగోలు చేస్తున్నా రు. మార్కెట్‌కు రైతులు ఎంతమంచి పసు పు తెచ్చినా క్వింటాలు ఈ సీజన్‌  మొదల యినప్పటి నుంచి నాలుగు వేల నుంచి  ఐ దు వలు దాటడం లేదు. వ్యాపారులు అం తకు మించి కొనడం లేదు. ఇతర పంటల లాగా పసుపునకు మద్దతు ధర లేకపోవ డం వల్ల వ్యాపారులు నిర్ణయించనదే ధర గా మారుతోంది. ఈ ధరలు కూడా ప్రతి రోజు రోజుకు మారుతోంది. రైతులు ఎండ చూసి నాణ్యమైన కర్కమిన్‌ అధికశాతం ఉ న్నది తీసుకువచ్చినా ధర పెరగడం లేదు. మార్కెట్‌కు ఆరోజు వచ్చే పసుపు సంచుల ను పరిశీలించి వచ్చిన సంఖ్య ఆధారంగా ధరను నిర్ణయిస్తున్నారు. మార్కెట్‌కు పసు పు బాగా వచ్చిన రోజు ధర కొద్దిగా పెరు గుతుండగా తక్కువ వచ్చిన రోజు తగ్గు తోంది. కొన్నిసార్లు రివర్స్‌గా ధర వస్తోంది. ప్రభుత్వ నియంత్రణ పసుపు ధరపై లేక పోవడం వల్ల రైతులకు భారీగా నష్టం జ రుగుతోంది. ఈ సీజన్‌లో సన్న, చిన్నకారు రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్ప డింది. రైతులు ప్రజా ప్రతినిధులు, అధికా రుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం మాత్రం లేదు. ధరలు మాత్రంపెరగడం లేదు.


ఎగుమతులు ఉన్నా ధర లేదు..

జిల్లా నుంచి వివిధ దేశాలకు ప్రతి యే డాది పసుపు ఎగుమతులు అవుతున్నా ఫ లితం మాతరం ఉండటం లేదు. జిల్లా కేం ద్రంలోని మార్కెట్‌లో పసుపుకొనే వ్యాపా రులు 25మందికిపైగా ఉన్నారు. వీరిలో ఎ గుమతులు చేసే వ్యాపారులు 10మందివర కు ఉన్నారు. వీరే కమీషన్‌ ఏజెంట్ల ద్వారా ప్రతి సంవత్సరం జిల్లాతో పాటు  ఇతర జి ల్లాల నుంచి వచ్చే పసుపును కొనుగోలు చే స్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు పంపిస్తున్నారు. మార్కెట్‌కు వ చ్చే పసుపునకు మద్దతు ధర లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధర నిర్ణయిం చక పోవడం వల్ల వ్యాపారులదే హవా కొనసాగుతోంది.


చెల్లింపుల్లోనూ కటింగ్‌..

మార్కెట్‌కు పసుపు తీసుకువచ్చిన రైతు లకు తక్షణం డబ్బులు చెల్లించాలన్నా క్యాష్‌ కటింగే జరుగుతుంది. అవసరం ఉన్న రైతు లకు అదే రోజు డబ్బులు చెల్లించాలంటే వందకు రూపాయి, లేదా 2 రూపాయలను కట్‌ చేసి ఇస్తున్నారు. వాయిదాల ద్వారా 10నుంచి 15 రోజులకు డబ్బులు చెల్లించే వారికి వ్యాపారులు కటింగ్‌ చేయడం లేదు. కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారుల సమన్వయంతో అసలే ధర రాకుంటా అమ్మకాలు చేసిన రైతులు ఈ కటింగ్‌తో మరింత నష్ట పోతున్నారు. ఈ విషయంపై జడ్పీ సమా వేశంలోనూ అధికారుల దృష్టికి  సభ్యులు తీసుకువచ్చారు.


ఈ-నామ్‌ ఉన్నా.. అంతంతే!

కేంద్ర ప్రభుత్వం రైతులకు మెరుగైన ధ ర కోసం ఈనామ్‌ ప్రవేశపెట్టింది. ఈ మా ర్కెట్‌ పేరు జాతీయ మార్కెట్‌లను అను సంధానం చేయడం వల్ల ఎక్కడి నుంచైనా వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం కో సం ఈ ఈనామ్‌ను పెట్టారు. ఈనామ్‌ ప ని మొదలై రెండు సంవత్సరాలు గడుస్తు న్నా ఫలితం మాత్రం లేదు. స్థానిక రైతు లు తీసుకువచ్చిన పసుపు, ఇతర దాన్యం లాట్లకు సంఖ్యను ఇవ్వడం, ధరలను ఆ రై తు సెల్‌కు పంపించడం కోసమే పని చే స్తోంది. ఇతర మార్కెట్లతో అనుసంధానం లేకపోవడం వల్ల ఈ-నామ్‌ ఉన్న లాభం లేని పరిస్థితి ఉంది. ఇతర మార్కెట్లతో అ నుసంధానం లేకపోవడం వల్ల ఇతర రా ష్ట్రాల వ్యాపారులు రావడం లేదు. పసుపు తెచ్చిన రైతులకు ఈ-నామ్‌ వల్ల ప్రయో జనం రావడం లేదు. కాగా వ్యవసాయ మార్కెట్‌లు నిత్యం అధికారులు పర్యవేక్షి స్తున్నా ఫలితం మాత్రం లేదు. పసుపు ధ రలు మాత్రం పెరగడం లేదు. మార్కెటింగ్‌ అధికారులు నిత్యం వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లతో సమీక్షిస్తున్నా ధరలు కనిష్ఠ స్థా యిలోనే ఉంటున్నాయి. గత సంవత్సరం లాగా కూడా ధరలు రావడం లేదు.


దృష్టిసారిస్తే మేలు..

జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్‌కు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ప ట్టించుకుంటే రైతులకు మేలు జరిగే అవకా శం ఉంది. జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రె డ్డి మినహా ఇప్పటి వరకు ఎవరూ మార్కె ట్‌వైపు వెళ్లలేదు. గడిచిన కొన్ని సంవత్సరా లుగా అధికార ప్రజాప్రతినిధులు మార్కెట్‌ వైపు రావడం లేదు. ధరలను పరిశీలించ డం లేదు. మార్కెట్‌ కమిటీలను నియమిం చి చేతులు దులుపుకుంటున్నారు. అంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల రైతులు విజ్ఞప్తులుచేసినా పట్టించుకునే వారు లేరు. పసుపు బాగా వచ్చిన సమ యంలో మార్కెట్‌కు అధికారులు వారినికొ కసారి తనిఖీలు చేసి వ్యాపారులు, మార్కెటింగ్‌ అధికారులతో సమీక్షిస్తే అధిక ధర వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ప్రజా ప్రతి నిధులతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు సైతం మా ర్కెట్‌ వైపు చూడడం లేదు. ప్రస్తుతం భారీ గా పసుపు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉ న్న తరుణంలో ప్రభుత్వం దృష్టి పెడితే రై తులకు మేలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2020-02-20T09:21:23+05:30 IST