Sriramsagar ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

ABN , First Publish Date - 2022-07-14T14:19:30+05:30 IST

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,04,041 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

Sriramsagar ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

నిజామాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు(Sriramsagar project)లోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,04,041 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు(90 టీఎంసీల)కు గాను ప్రస్తుత నీటి మట్టం 1087.40 అడుగుల(74.506 టీఎంసీలు)కు చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు 36 గేట్ల ద్వారా 4,16,934 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూన్ మొదట నుండి ప్రాజెక్టులోకి 107.831 టీఎంసీలు వరద చేరింది. మొత్తం ఔట్ ఫ్లో 53.391 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 

Updated Date - 2022-07-14T14:19:30+05:30 IST