నిజామాబాద్‌ ఎస్‌ఈపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-09-18T06:41:16+05:30 IST

నిజామాబాద్‌ ఎస్‌ఈ సుదర్శన్‌పై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాల యం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి జాక్‌ ప్రతినిధులు ధర్నా చేశారు. నిజామాబాద్‌ ఎస్‌ఈ సుదర్శన్‌ జాక్‌ నాయకులపై అట్రాసిటీ కేసును ఫైల్‌ చేయాలని నిజామాబాద్‌ డీఎస్‌పీకి విన్నవించినందుకు నిరసనగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం విద్యుత్‌ జాక్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

నిజామాబాద్‌ ఎస్‌ఈపై విచారణ జరపాలి
కామారెడ్డి ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న విద్యుత్‌ ఉద్యోగులు

కామారెడ్డి, సెప్టెంబరు 17: నిజామాబాద్‌ ఎస్‌ఈ సుదర్శన్‌పై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాల యం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి జాక్‌ ప్రతినిధులు ధర్నా చేశారు. నిజామాబాద్‌ ఎస్‌ఈ సుదర్శన్‌ జాక్‌ నాయకులపై అట్రాసిటీ కేసును ఫైల్‌ చేయాలని నిజామాబాద్‌ డీఎస్‌పీకి విన్నవించినందుకు నిరసనగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం విద్యుత్‌ జాక్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్‌లో పనిచేస్తున్న జాక్‌ చైర్మన్‌ గడ్డం లక్ష్మారెడ్డి, ఏడీఈ తోట రాజశేఖర్‌పై అట్రాసిటీ కేసు పెట్టేందుకు ఫిర్యాదు చేయడం హేయమైన చర్య అని, నిజామాబాద్‌ ఎస్‌ఈపై పోలీసులు విచారణ జరపాలని కోరారు.  ఇందులో విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజారెడి ్డ, ప్రదీప్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T06:41:16+05:30 IST