నిజామాబాద్: పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మేరీ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కూరగాయాల కోసం బైక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.