Nizamabad జిల్లా వ్యాప్తంగా ఏడవ రోజు కొనసాగుతున్న వర్షం

ABN , First Publish Date - 2022-07-14T15:46:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 7వ రోజు కొనసాగుతున్న వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Nizamabad జిల్లా వ్యాప్తంగా ఏడవ రోజు కొనసాగుతున్న వర్షం

నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా 7వ రోజు కొనసాగుతున్న వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు 30 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. జిల్లాలో సుమారు 50కి పైగా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 27,802 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 19,980 ఎకరాల్లో వరి, 5,251 ఎకరాల్లో సోయాబిన్‌, 2,383 ఎకరాల్లో  మొక్కజొన్న, 188 ఎకరాల్లో పత్తి, 4,608 ఎకరాల్లో వరి నారుమడులు దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ వర్షాలకు ఇప్పటి వరకు 417 ఇళ్లు పాక్షికంగా, 11 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 50కి పైగా రోడ్లపై నీళ్లు పారుతుండగా ఇప్పటి వరకు 16 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలో మొత్తం 1067 చెరువులు ఉండగా 944 చెరువులు పూర్తిగా నిండి మత్తడులు పారుతున్నాయి. ఇప్పటి వరకు 150 వరకు పోల్స్‌, 18 ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-07-14T15:46:00+05:30 IST