నిజామాబాద్‌ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో తెర మీదకు కొత్తపేర్లు

ABN , First Publish Date - 2022-01-09T22:21:22+05:30 IST

ఆర్థిక వెతలు నిండు కుటుంబాన్ని ఛిద్రం చేశాయి. నిజమాబాద్‌కు చెందిన ఈ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం రెండు

నిజామాబాద్‌ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో తెర మీదకు కొత్తపేర్లు

విజయవాడ: ఆర్థిక వెతలు నిండు కుటుంబాన్ని ఛిద్రం చేశాయి. నిజమాబాద్‌కు చెందిన ఈ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. నిజామాబాద్‌ వాసుల ఆత్మహత్యకేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫైనాన్స్‌ సంస్థల వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌‌లో పేర్కొన్నారు. శనివారం ఇద్దరు కుమారులు సహా దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సురేష్‌ కుటుంబం సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను కుటుంబం లేఖలో పేర్కొన్నారు. వేధించిన వారి వివరాలు సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీడియోను మృతుడు పప్పుల సురేష్‌ బంధువులకు పంపారు. ఫైనాన్షియర్ల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. ఫ్లాట్‌ వేలం వేస్తామని బెదిరించడంతోనే సూసైడ్‌ చేసుకున్నట్టు వీడియోలో తెలిపారు. సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో తెర మీదకు కొత్తపేర్లు వస్తున్నాయి. వడ్డీ వ్యాపారులు వినీత, చంద్రశేఖర్‌ పేర్లను మృతుల బంధువులు చెబుతున్నారు. 10-20 శాతం వడ్డీకి అప్పులివ్వడమే కాకుండా తీర్చారంటూ వేధింపులకు దిగారని చెబుతున్నారు. సురేష్‌ కుటుంబంతో వడ్డీ వ్యాపారులు.. అసభ్యంగా మాట్లాడిన ఆడియోను బంధువులు పోలీసులకు ఇచ్చారు.


తెలంగాణ రాష్ట్రంలోని నిజమాబాద్‌కు చెందిన సురేష్‌(56) అక్కడే పెట్రోలు బంక్‌ అద్దెకు తీసుకున్నారు. ఆయన భార్య శ్రీలత(54) ఇంటి వద్ద బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. పెద్ద కుమారుడు అఖిలేశ్వర్‌(28) బీటెక్‌ పూర్తిచేశాడు. రెండో కుమారుడు ఆశీష్‌(22) బీఫార్మసీ పూర్తి చేసి నిజమాబాద్‌లోనే మెడికల్‌ షాపు నిర్వహించేవాడు. ఈ నెల ఆరో తేదీన విజయవాడ వన్‌టౌన్‌ రథం సెంటర్‌లోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అన్నసరత్రంలో వీరు గది అద్దెకు తీసుకున్నారు. సత్రంలో దిగినప్పటి నుంచి వారు బయటకు రాలేదు. సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సురేష్‌ తన బావమరదులకు వాట్సా్‌పలో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని వాయిస్‌ మెసేజ్‌లు పంపారు.

Updated Date - 2022-01-09T22:21:22+05:30 IST