ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి: శ్యామ్ రావు

ABN , First Publish Date - 2022-01-17T16:06:02+05:30 IST

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్యామ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి: శ్యామ్ రావు

నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ముల్లంగి సర్పంచ్ పావని భర్త శ్యామ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జడ్పీ చైర్మన్ విఠల్ రావుతో కలిసేవారిని ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారని, అనుచరులతో బెదిరింపులు, భౌతిక దాడులు, వ్యాపారాలపై పోలీసుల దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. జెడ్సీ ఛైర్మన్‌కు మద్దతుగా నిలిచినందుకే తన వ్యాపారంపై దాడి చేయించారన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని శ్యామ్ రావు అన్నారు.

Updated Date - 2022-01-17T16:06:02+05:30 IST