Abn logo
Sep 29 2020 @ 01:40AM

నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ పరిశీలకుడు

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సా ధారణ పరిశీలకుడు, రిజిస్ర్టార్‌, సహకార శాఖ కమిషనర్‌ వీర బ్రహ్మయ్య సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భం గా ఆయనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అధికారి, నిజామాబాద్‌ కలెక్ట ర్‌ సి.నారాయణరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో కలెక్టర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు వీర బ్రహ్మయ్య మాట్లాడుతూ, ఎన్నికకు సంబంధించి ఏవైనా ఫి ర్యాదులు ఉంటే 9491007423 నెంబర్‌కు తెలియజేయాలని సూ చించారని కలెక్టర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement