నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురుసౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జామునుంచే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ సాయిబాబాను దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులు పూజలు చేస్తున్నారు. జిల్లాలోని మాధవనగర్, హమాల్ వాడి ఆలయంలో భక్తులు దర్శనానికి బారులు తీరారు.