నిజామాబాద్: డిప్యూటేషన్‌ను ఆపాలంటూ జక్రాన్‌పల్లి ఎంపీడీఓ భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భారతిని అధికారులు డిప్యూటెషన్ మీద సిరికొండకు పంపారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా సిరికొండ వెళ్లలేనని, కొన్ని రోజుల వరకు డిప్యూటెషన్ను నిలిపివేయాలంటూ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్దకు భారతి వెళ్లారు. తన డిప్యూటెషన్ను ఆపాలంటూ భారతి... ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నారు. అందుకు ఎమ్మెల్యే సహకరించక పోవడంతో మనస్తాపం చెందిన భారతి బలవన్మరణానికి యత్నించారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు.