Jun 3 2021 @ 07:52AM

మహేష్ సినిమాలో నివేథా థామస్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేథా థామస్ అవకాశం అందుకుందా.. అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. లాక్ డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇందులో నివేథాకి అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్‌'లో నటించిన ఈమెకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమాలో అంటే గొప్ప అవకాశమే అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.