Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 17 May 2022 13:40:59 IST

Nivetha Pethuraj: నేను ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు..

twitter-iconwatsapp-iconfb-icon

'నేను ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు'..అంటున్నారు యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj). శ్రీ విష్ణు (Sri Vishnu) హీరోగా వచ్చిన మెంటల్ మదిలో (Mental Madilo) సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నివేతాకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్ లాంటి సినిమాలు చేశారు. అయితే, వీటిలో హీరోయిన్ రోల్ కాకపోవడం మైనస్ అయింది.

పర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేతాకు నటిగా మంచి గుర్తింపు దక్కినప్పటికీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయారు. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోన్న నివేత.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలతో పాటుగా వక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Nivetha Pethuraj: నేను ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు..

ఈ నేపథ్యంలో నివేతా మాట్లాడుతూ.. 'హీరోయిన్ అవ్వడం కంటే కూడా నటి అనిపించుకోవడం గర్వంగా ఉంది. హీరోయిన్‌గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. నటకు ప్రాధాన్యత ఉంటే.. ఎలాంటి పాత్రలైనా చేస్తాను. ఒకవేళ ఆఫర్లు రాకపోతే ఉద్యోగం అయినా చేసుకుంటా. ఆ సత్తా నాకు ఉంది'.. అని చెప్పుకొచ్చారు. కాగా, నివేతా పేతురాజ్ రీసెంట్‌గా 'బ్లడీ మేరీ' అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో వచ్చి ఆకట్టుకుంది. ఇక ఆమె నటించిన 'విరాట పర్వం' (Virata Parvam) మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వేణు ఊడుగుల (Venu uDugula) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి (Rana adaggubati), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా.. ప్రియమణి (Priyamani), నందితా దాస్ (Nanditha Daas) ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూలై 1న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement