కూల్‌.. కూల్‌

ABN , First Publish Date - 2020-11-29T05:06:47+05:30 IST

నివర్‌ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

కూల్‌.. కూల్‌
హన్వాడలో కల్లాల వద్దే ధాన్యం కుప్పలపై టార్పాలిన్లను కప్పిన రైతులు

- ‘నివర్‌’ ప్రభావంతో వాతావరణంలో తీవ్ర మార్పులు

- పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

- ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ముసురు

- జోగుళాంబ గద్వాల జిల్లాలో దెబ్బతిన్న వరి పంటలు

- ఆందోళనలో రైతాంగం


(గద్వాల-ఆంధ్రజ్యోతి)/మహబూబ్‌నగర్‌/నారాయణపేట/వనపర్తి రాజీవ్‌ చౌరస్తా, నవంబరు 28 : నివర్‌ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీని ప్రభావంతో ఉమ్మడి పాల మూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి శనివారం వరకు కొన్ని జిల్లాల్లో ముసురు పడింది. అలాగే చలిగాలులు తీవ్రం అవడంతో పాటు, పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చేతికొ చ్చిన పంటను కోసుకుందామనుకున్న సమయంలో తుపాన్‌ రైతులను కంటి మీద కునుకు లే కుండా చేస్తోంది. ఇప్పటికే కోసుకొని ఆరబోసుకుందామనుకున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇ బ్బంది పడాల్సి వస్తోంది.

జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా శనివారం 218.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా కేటీదొడ్డిలో 15.2 మి.మీ., ధరూరులో 19.2, గద్వాలలో 23.2, ఇటిక్యాలలో 27.7, మల్దకల్‌లో 19, గట్టులో 17.6, అయిజలో 15.5, రాజోలిలో 22.3, వడ్డేపల్లిలో 19.3, మానవపాడులో 18.6, ఉండవల్లిలో 15.6, అలంపూర్‌లో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షం కా రణంగా కొన్ని చోట్ల వరి పైర్లు నేలకొరిగాయి. జిల్లా వ్యాప్తంగా 1,045 ఎకరాల్లో వరి, ఐదు ఎకరా ల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటికే రైతులు మూడొంతులు వరి పంటలను కోనుకున్నారు. వాటిలో చాలా వరకు విక్రయాలు జరిపారు. శుక్రవారం జల్లులు, ముసురు కురిసినా శనివారం వర్షం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొనుగోలు కేంద్రాలను బంద్‌ చేయడంతో రైతులు ధా న్యాన్ని కాపాడుకోవడం కోసం రోడ్లపై, కల్లాలో, ఇళ్ల ముందు కుప్పలుగా పోసి టార్పాలిన్‌లను క ప్పి ఉంచారు. కాగా, వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వా తావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తుపాన్‌ కార ణంగా చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు 101.4 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. మండలాల వారీగా కృష్ణాలో 16.5 మీ.మీ., నారాయణపేటలో 3.0, దామరగిద్దలో 4.2, ఊట్కూర్‌లో 15.2, మాగనూర్‌లో 12.0, మక్తల్‌లో 12.6, నర్వలో 9.6, మరికల్‌లో 7.5, ధన్వాడలో 8.4, మద్దూర్‌లో 6.2, కోస్గిలో 6.2 మి.మీ. వర్షం కురిసింది.

నివర్‌ ప్రభావంతో వనపర్తి జిల్లా వ్యాప్తంగా శనివారం జల్లులు కురిశాయి. అత్యధికంగా మదనాపురం మండలంలో 16 మిల్లీమీటర్లు, మిగిలిన మండలాల్లో 10 మి.మీ. వర్షపాతం నమో దైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి.

Updated Date - 2020-11-29T05:06:47+05:30 IST