‘పంచ గంగలు’ అంటే..?

ABN , First Publish Date - 2021-12-10T05:30:00+05:30 IST

మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ప్రతి నదికీ తనదైన విశిష్టత ఉంది. అయితే వీటన్నిటిలోనూ అయిదు నదులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణనలో ఉన్నాయి.....

‘పంచ గంగలు’ అంటే..?

మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ప్రతి నదికీ తనదైన విశిష్టత ఉంది. అయితే వీటన్నిటిలోనూ అయిదు నదులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణనలో ఉన్నాయి. వాటిని ‘పంచగంగలు’ అని అంటారు. ఆ నదులు కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి లేదా గంగానది.  నిత్య పూజా సంకల్పంలో ‘కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః’ అనే శ్లోకం ఉంది. ఈ నదుల్లో గంగానది మినహా మిగిలినవన్నీ దక్షిణ భారతదేశంలోనే ప్రవహిస్తూ ఉండడం విశేషం. ఇవన్నీ పుష్కర నదులే. ఈ అయిదు నదుల్లో స్నానం చేయడం లేదా స్నానం చేస్తున్నప్పుడు వాటిని తలచుకోవడం పుణ్యప్రదమని శాస్త్రవచనం. 

Updated Date - 2021-12-10T05:30:00+05:30 IST