అన్నదాతలో ‘నివర్‌’ అలజడి

ABN , First Publish Date - 2020-11-25T05:16:08+05:30 IST

వర్‌ తుఫాన్‌ హెచ్చరికతో రైతులు, మత్స్యకారుల్లో అలజడి రేగింది. మంగళవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు లు చోటు చేసుకొని ఆకాశం మేఘా వృతం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతలో ‘నివర్‌’ అలజడి
నరసన్నపేట: జమ్ములో లగేజీ ఆటోలో వరి పంటను తరలిస్తున్న దృశ్యం


నరసన్నపేట/గార/నందిగాం

నివర్‌ తుఫాన్‌ హెచ్చరికతో రైతులు, మత్స్యకారుల్లో అలజడి రేగింది. మంగళవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు లు చోటు చేసుకొని ఆకాశం మేఘా వృతం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం నుంచి వరి పంట ను కాపాడుకునేం దుకు నానా తంటాలు పడుతు న్నారు. నరసన్నపేట మండలం కోమర్తి, సత్య వరం, జమ్ము, తామరా పల్లి, కంబకాయి తదితర గ్రామాలతో పాటు గార, నందిగాం మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. పంట వర్షానికి తడిసిపోకుండా రైతులు పచ్చి చేలనే కుప్పలుగా పెడుతున్నారు. కొందరు కళ్లాలకు వరి చేలు తెచ్చి గడ్డి, టార్పాలిన్లు కప్పుతున్నారు. తుఫాన్‌ కారణంగా ఏ మాత్రం వర్షం పడినా, గాలులు వేసినా నష్టపో తామని రైతులు ఆవేదన చెం దుతున్నారు. మరోపక్క మత్స్యకారులు సముద్రం లో చేపల వేటకు వెళ్లకుండా పడవులు, తెప్పలు, వలలు, ఆయిల్‌ మోటార్లు, మొదలైన వా టిని సురక్షిత ప్రదేశంలో భద్రపరచుకుంటున్నారు.



Updated Date - 2020-11-25T05:16:08+05:30 IST