నివర్‌ వర్రీ!

ABN , First Publish Date - 2020-11-25T06:56:31+05:30 IST

(అమలాపురం/ సామర్లకోట-ఆంధ్రజ్యోతి) ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ నివర్‌ పెనుతుఫాను ప్రభావంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. వరిపంట కోతకు వచ్చిన తరుణంలో తుఫాను హెచ్చరికలు వారిలో అలజడి రేపుతోంది. ఇప్పటికే వరదలు, భారీవర్షాల వంటి వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రమైన పంట నష్టాలు చవి చూసిన

నివర్‌ వర్రీ!
తుఫాను ప్రభావంతో అంతర్వేది సముద్రంలో మంగళవారం నాడు ఒడ్డుకు చేరిన బోట్లు

అన్నదాతల్లో అలజడి

మిగిలిన కొద్దిపాటి పంటను సంరక్షించుకునే పనిలో రైతులు

ఇప్పటికే వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రనష్టాలు

తీరప్రాంతాల్లో అలర్ట్‌ అయిన అధికారులు


(అమలాపురం/ సామర్లకోట-ఆంధ్రజ్యోతి)

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ నివర్‌ పెనుతుఫాను ప్రభావంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. వరిపంట కోతకు వచ్చిన తరుణంలో తుఫాను హెచ్చరికలు వారిలో అలజడి రేపుతోంది. ఇప్పటికే వరదలు, భారీవర్షాల వంటి వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రమైన పంట నష్టాలు చవి చూసిన రైతులు పంటలు చేతికి వచ్చే దశలో తుఫాను ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సాగుచేసిన వరిసేద్యం వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఉన్న కొద్దిపాటి పంటను సంరక్షించుకున్న రైతులు కోత దశకు వచ్చిన తరుణంలో నివర్‌ తుఫాను హెచ్చరిక వారిని మరింత కష్టాలపాలు చేసింది. హడావుడిగా పంటలను కోసి సంరక్షించుకునే పనిలో రైతులు ఉన్నారు. పలుచోట్ల పంట లను కోసి పనలను కుప్పలుగా వేస్తున్నవారు కొందరైతే, మరికొందరు యాంత్రీకరణ ద్వారా హడా వుడిగా వరి నూర్పిళ్లు చేపట్టారు. కోనసీమవ్యాప్తంగా పలుచోట్ల అన్నదాతల హడావుడి  కనిపిస్తుంది. తుఫాను తీవ్రత తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ర్టాల మధ్య ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నప్పటికీ చేరువలో ఉన్న ఏపీలోని కోస్తా జిల్లాలపై కూడా తుఫాను ప్రభావం ఉండొచ్చన్న ముందస్తు హెచ్చరికలతో రైతులు అప్రమత్తమయ్యారు. కూలీలకు అధిక ధరలు చెల్లించి నూర్పిళ్లు చేస్తున్నారు. బంగాళాఖాతం తీరానికి చేరువలో ఉన్న సఖినేటిపల్లి, మలికి పురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల పరిధిలో ఉన్న పంట భూముల్లో కోతల హడావిడి ముమ్మరమైంది. ఉన్న కొద్దిపాటి పంటను రక్షించుకునే పనిలో రైతులు ఉన్నారు. వ్యవసాయశాఖ అధికారులు తీరప్రాంత మండలాల్లో పర్యటించి రైతులకు సూచనలు చేస్తున్నారు. పంటలు కొన్నిచోట్ల దిగుబడులు వచ్చి నప్పటికీ మరికొన్నిచోట్ల ఆశించిన మేర పండకపోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారు. ఈసారి తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై ఉంటే వరి సాగు చేసిన రైతులకు తీవ్ర కష్ట నష్టాలను చవిచూడాల్సి వస్తుందంటూ పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.


నివర్‌ తుఫాను హెచ్చరికలు..

నివర్‌ తుఫాను ప్రభావంతో తీరప్రాంతంలో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్ల వద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఆయా ప్రాం తాల్లో దండోరా కూడా వేయిస్తున్నారు. మరోవైపు వ్యవసా యశాఖ అధికారుల బృందాలు గ్రామాల్లో పర్యటించి పంట సంరక్షణపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. తుఫాను తీవ్రత తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ర్టాలపై ప్రభావం చూపు తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కోస్తా జిల్లాలపై కూడా తీవ్ర ప్రభావం ఉండవచ్చన్న హెచ్చరికలతో అమలా పురం డివిజన్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అప్ర మత్తమయ్యారు. ఇప్పటికే కోనసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతుండడంతోపాటు సముద్ర తీరంలో మాత్రం అలజడి తీవ్రంగానే ఉంది.


రైతులు పాటించాల్సిన మెలకువలు ఇవే...

ప్రస్తుత వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికల దృష్ట్యా రైతులు ఈ మెలకువలు పాటించి పంటను కాపా డుకోవచ్చని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కేఎస్వీ ప్రసాద్‌ చెప్పారు. కోసిన వరిపనలను కుప్పలుగా పోసి ఆ కుప్పలపై బరకాలు రక్షణగా కప్పాలని సూచిం చారు. కోతలు, మాసూళ్లు వంటి వ్యవసాయ పనులను నిలిపివేయాలన్నారు. వరి పనలపై 5 శాతం ఉప్పు ద్రావ ణాన్ని పిచికారీ చేయాలి. కోసిన వరి తడిగా ఉంటే ఎకరాకు ఒక కిలో ఉప్పును జల్లి ఆరబెట్టాలని, దీనివల్ల గింజ రాల డంకానీ, రంగు మారడంకానీ ఉండదన్నారు. ఆరబెట్టిన ధాన్యానికి ఉప్పుతోపాటు 4 కిలోల తవుడు కలిపితే ధాన్యంలో మొలక శాతాన్ని నివారించవచ్చని తెలిపారు. కాగా ఇప్పటికే తుఫానుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక అధికారులను రంగంలోకి దింపింది.

Updated Date - 2020-11-25T06:56:31+05:30 IST