కుండపోతగా..

ABN , First Publish Date - 2020-11-27T07:52:22+05:30 IST

నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి మొదలు గురువారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం జిల్లా అం తటా ప్రభావం చూపుతోంది. భారీ ఈదురుగాలులకు తోడు తీవ్రమైన చలితో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

కుండపోతగా..
నివర్‌ తుఫాను ప్రభావంతో ఉప్పాడలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం

  • నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రోజంతా ఏకధాటిగా భారీ వర్షం
  • అమలాపురంలో 8సెం.మీ. వర్షపాతం 8 ఈదురుగాలులు.. చలి తీవ్రతతో వణుకు 
  • కాకినాడపోర్టులో నిలిచిన బియ్యం ఎగుమతులు.. 89బార్జీలు ఎక్కడికక్కడే
  • వర్షాలతో జిల్లాలో 75వేల ఎకరాలకుపైగా వరి పంటకు నష్టం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి మొదలు గురువారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం జిల్లా అం తటా ప్రభావం చూపుతోంది. భారీ ఈదురుగాలులకు తోడు తీవ్రమైన చలితో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా గురువారం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. కోనసీమలో ని వర్‌ తుఫాను ప్రభావం అధికంగా ఉంది. అమలాపురంలో అత్యధికంగా 8.8 సెంటీమీట ర్ల వర్షపాతం నమోదైంది. అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తంలో ఏడు సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం గుర్తించారు. ఎడతెరిపిలేకుం డా కురుస్తున్న వానలతో జిల్లాలో అనేకచోట్ల లోతట్టుప్రాంతాల జలమయమయ్యాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలో పలుచోట్ల ఎక్క డికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. పట్టణాల్లోను వర్షం కుండపోతగా కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమై జనం ఇబ్బం దులు పడుతున్నారు. గ్రామా ల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తుఫా ను గురువారం తెల్లవారుజామున చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటిన తర్వాత దీని ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కుండపోతగా మారాయి. అనేకచోట్ల తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ పరిసరప్రాంతా ల్లో అలలు రోడ్డుపైకి వచ్చాయి. కొత్తపల్లి మండలం సూరాడపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయం గత నెల్లో తుఫాను కారణంగా ముందుకొచ్చిన కెరటాల తాకిడికి నేలమట్టం కాగా, గురువారం పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. వర్షాలతో గోదావరిలో వరద స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీవద్ద ప్రస్తుతం 18,054 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 45.65 అడుగులుగా ఉంది. అటు ఏలేరు, తాండవ జలాశయాల్లోకి స్వల్పం గా ఎగువనుంచి వరద కొనసాగుతోంది. తుఫాను ముప్పుతో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోయా యి. సముద్రంలో ఇప్పటికే మూడు నౌకలు బియ్యం లోడింగ్‌ కోసం సిద్ధంగా ఉండగా, వీటి వద్దకు బియ్యం లోడుతో వెళ్లే 89 బార్జీలు పోర్టులో ఆగిపోయాయి. అన్‌లోడింగ్‌ కోసం రా వాల్సిన కొన్ని విదేశీనౌకలు సముద్రం మధ్యలో ఉండిపోయాయి.

వరుస కష్టాలు..

తుఫాను ప్రభావంతో జిల్లాలో అన్నదాతలు వణికిపోతన్నారు. గతనెలలో వరుసగా కురిసిన భారీ వర్షాలకు వరిచేలు నీటమునిగిపోయాయి.  అప్పుడు జిల్లావ్యాప్తంగా 1.50లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఈ గాయం మానకుండానే ఇప్పుడు మళ్లీ నివర్‌ తుఫాను ప్రభావంతో ఎక్కడికక్కడ వరిచేలు నేలకొరిగిపోయాయి. గురువారం వర్షాలకు జిల్లావ్యాప్తంగా 75వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా గుర్తించింది. నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేసింది. 

77వేల ఎకరాల్లో పంట చేతికందాలి: వ్యవసాయశాఖ జేడీ

సామర్లకోట, నవంబరు 26: జిల్లాలో గురువారం నాటికి జిల్లావ్యాప్తంగా 62 మండలాల్లో నేలవాలిన పంట, వరిపనలు, కుప్పలు, మాసూళ్లు వంటి అంశాల్లో 77వేల404 ఎకరాల్లో పంట రైతుల చేతికందాల్సి ఉందని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కేఎస్వీ ప్రసాద్‌ వెల్లడించారు. సామర్లకోట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పంట పక్వదశకు చేరి నేలవాలిన పంటగా 26వేల412ఎకరాలు, పనలపై 6772ఎకరాలు, కుప్పలపై 18వేల305ఎకరా లు, ఎగరబోత దశలో 25వేల 305 ఎకరాలు ఉందన్నారు.

Updated Date - 2020-11-27T07:52:22+05:30 IST