పంటలను ముంచిన నివర్‌

ABN , First Publish Date - 2020-11-28T06:34:18+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో అన్ని రకాల పంటలకు తీరని న ష్టం వాటిల్లింది. నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో వరి, సుమారు 1000 ఎకరాల్లో మినుము, 3 వేల ఎకరాల్లో పొగాకు దెబ్బతిన్నట్లు అం చనా.

పంటలను ముంచిన నివర్‌
ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తికి పంటనష్టాన్ని వివరిస్తున్న రైతు

అద్దంకి, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో అన్ని రకాల పంటలకు తీరని న ష్టం వాటిల్లింది.  నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో వరి,  సుమారు 1000 ఎకరాల్లో మినుము, 3 వేల ఎకరాల్లో పొగాకు  దెబ్బతిన్నట్లు  అం చనా. పంగులూరు, కొరిశపాడు, అద్దంకి మండలాల్లో శనగ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అద్దంకి మండలం తిమ్మాయపాలెం,కొత్తరెడ్డిపాలెం వద్ద నీటి మునిగిన వరి పంటను  ఉద్యానశాఖ ఏడీ నాగరాజు, తహసీల్దార్‌ ప్రభాకరరావు, ఏవో వెంకటకృష్ణ, ఏఎ్‌సవో అమరనాథ్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు 

ఉధృతంగా వాగులు  : పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు  నిలిచిపోయాయి. అద్దంకి మండలం పేరాయపాలెం వద్ద చప్టాపై దోర్నపువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అద్దంకి నుంచి పే రాయపాలెం,ధేనువకొండకు, అలాగే బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద వాగు ఉధృతికి  అ ద్దంకి-బల్లికురవ మధ్య రాకపోకలు నిలిచిపోయా యి. బల్లికురవ-నక్కబొక్కలపాడు మధ్య వాగు, చిలకలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

 పలు రూట్లలో బస్సుల రద్దు  : వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అద్దం కి డిపో పరిధిలో శుక్రవారం పలు రూట్లలో బ స్సు సర్వీసులు రద్దు చేసినట్లు డీఎం సుష్మ తెలిపారు. అద్దంకి నుంచి పొదిలి, వినుకొండ, బి.నిడమానూరు రూట్‌లలో బస్సుసర్వీసులు నిలిపి వేసినట్లు తెలిపారు. చీరాల నుంచి షాపూర్‌ వెళ్లే బస్సు సర్వీసు కూడా రద్దయినట్లు తెలిపారు.


 ఎమ్మెల్యే బలరాం పరిశీలన


చీరాల  : నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లు తదితరాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు వెంటనే నష్టం అంచనాలను తయారుచేయాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సూచించారు. చీరాల ని యోజకవర్గంలో పలుప్రాంతాల్లో  దెబ్బతిన్న పం టలను శుక్రవారం ఆయన మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వరికూటి అమృతపాణి, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు తదితరులతో కలసి పరిశీలించా రు. వాడరేవు సముద్రతీరంలో స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. కాగా మండలంలో జరిగిన పంటనష్టంపై ఏవో ఐ.సుమతి పరిశీలించారు. 


వేయి ఎకరాల్లో పంట నష్ఠం


చీమకుర్తి : మండలంలో తుపాను ప్రభావం తో వేయి ఎకరాలకు పైగా పంటనష్టం వాటి ల్లిం ది. కోతకొచ్చిన వరిపంట  నేలకొరిగింది. కాగా బండ్లమూడి వద్ద ఎర్రవాగు పొంగిపొర్లడంతో రా కపోకలు నిలిచిపోయాయి. పాటిమీదపాలెం, నా యుడుపాలెం తదితర ప్రాంతాలో దాదాపు 100 వరకు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. 




Updated Date - 2020-11-28T06:34:18+05:30 IST