లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , First Publish Date - 2021-10-21T06:50:02+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కి బుధవారం నిత్యవిధి పూజాకైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యార్చనలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ముందుగా ప్రధానాలయంలోని స్వయంభులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు.

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు
ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దేవస్థాన సిబ్బంది

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కి బుధవారం నిత్యవిధి పూజాకైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యార్చనలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ముందుగా ప్రధానాలయంలోని స్వయంభులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తులసీదళాలతో అర్చించారు. అనంతరం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. కొండపైన రామలింగేశ్వరస్వామికి, చరమూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించా రు. స్వామికి బుధవారం భక్తులనుంచి వివిధ విభాగాల ద్వారా రూ.7,44,665 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.


సీఎం కేసీఆర్‌ పేరిట పూజలు

యాదాద్రిక్షేత్రంలో దేవస్థాన సిబ్బంది సీఎం కేసీఆర్‌ పేరిట బుధవారం ప్రత్యేకపూజలు చేశారు. యాదాద్రి దేవస్థాన సిబ్బందికి పీఆర్‌సీ అమలు తోపాటు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు సీఎం మంగళవారం యాదాద్రి పర్యటనలో వెల్లడించారు. దీంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని గజవెల్లి రమేశ్‌బాబు పర్యవేక్షణలో బాలాలయ మండపంలో కవచమూర్తుల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-10-21T06:50:02+05:30 IST