Abn logo
Oct 19 2021 @ 23:48PM

సుర్జాపూర్‌లో ఘనంగా నిత్యహవన పూజలు

నిత్యహవన పూజలు చేస్తున్న అర్చకులు

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 19 : ఖానాపూర్‌ మండలంలోని సుర్జాపూర్‌ గ్రామంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా మంగళ వారం నిత్యహవనం, సద్యస్యము వేదగోష్టిపూజ, మంత్రపుష్పం కార్యక్రమం వేదమంత్రాల మధ్యఘనంగా నిర్వహించారు. వేదపండితులు చక్రపాణి నర్సింహమూర్తి, కోటపల్లి అవీష్‌ ఆధ్వర్యంలో వేదపూజలు చేసారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాథోడ్‌ రామునాయక్‌, ఎంపీటీసీ సరిత శంకర్‌, ఉపసర్పంచ్‌ అనుప హరీష్‌, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.