కులగణన కోరాం, ఇక నిర్ణయం ప్రధానిదే : నితీష్

ABN , First Publish Date - 2021-08-23T21:32:10+05:30 IST

బీహార్‌కు చెందిన 10 రాజకీయ పార్టీల నేతలతో కూడిన ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో సోమవారంనాడు..

కులగణన కోరాం, ఇక నిర్ణయం ప్రధానిదే : నితీష్

న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన 10 రాజకీయ పార్టీల నేతలతో కూడిన ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో సోమవారంనాడు కలుసుకుంది. కులాలవారీ జనగణన నిర్వహించే అంశంపై చర్చించేందుకు వీరు ప్రధానిని కలిసారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, హెచ్ఏఎం నేత జితిన్ రామ్ మాంఝీ, వీఐపీ నేత ముఖేష్ సహాని తదితరులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.


ప్రధానితో సమావేశానంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నాయకులందరి అభిప్రాయాలను ప్రధాని విన్నారని, దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రధానిని కోరామని చెప్పారు. కులసమీకరణ కోరుతూ రెండుసార్లు బీహార్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు.


దేశమంతటా కులజనగణన జరగాలి: తేజస్వి

కులగణన విజ్ఞప్తిపై ప్రధానిని తాము కలిసినట్టు తేజస్వి యాదవ్ తెలిపారు. కులగణన కేవలం బీహార్‌లోనే కాకుండా దేశమంతటా నిర్వహించాలని, దీనిపై ఒక నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, బీహార్‌లో బీజేపీ మినహా కులాలవారీ జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను కేంద్రం ఇప్పటివరకూ తోసిపుచ్చుతున్నప్పకీ బీహార్ ఉప ముఖ్యమంత్రి రేణుదేవి సహా పలువురు బీజేపీ నేతలు కులగణనకు మద్దతు పలుకుతున్నారు. ఈ డిమాండ్‌పై నితీష్, తేజస్వి ఏకాభిప్రాయంతో ఉండటం, ఇద్దరూ ప్రతినిధి బృందంలో పాలుపంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-08-23T21:32:10+05:30 IST