Advertisement
Advertisement
Abn logo
Advertisement
Feb 2 2020 @ 10:19AM

అమిత్‌షాతో వేదిక పంచుకోనున్న నితీష్

న్యూఢిల్లీ::

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని బురారి నియోజవర్గంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జేడీయూ అభ్యర్థి శైలేంద్ర కుమార్ పోటీ చేస్తున్నారు. ఈసారి బీజేపీ పొత్తుతో జేడీయూ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగింది. దీంతో బీజేపీ అగ్రనేతలతో పాటు జేడీయూ చీఫ్‌, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ఇవాళ ఒకే వేదికమీదకు రాబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు నితీష్ తొలిసారి వేదికను పంచుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ బహిరంగ సభలో అమిత్‌షా, నితీష్ కలిసి జేడీయూ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరనున్నారు. నితీష్ రెండో ర్యాలీ సంగమ్ విహార్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ బహిరంగ సభలో నితీష్‌తో పాటు నడ్డా పాల్గొంటారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది.

TAGS:
Advertisement
Advertisement