పాట్నా : పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, వేధించడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. పెగాసస్ మొత్తం వ్యవహారాన్ని కేంద్రం ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా రోజులుగా ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతూనే ఉందని, పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు కూడా ప్రస్తావించాయని, మీడియా కూడా పుంఖాను పుంఖాలుగా వార్తలను ఇచ్చిందన్నారు. ఈ విషయంపై కేంద్రం ఓ స్పష్టమైన ప్రకటన చేసి, ఏం జరిగిందన్నది ప్రజలకు విశదపరచాలని నితీశ్ సూచించారు.