Abn logo
Mar 30 2020 @ 03:53AM

పెళ్లి వాయిదా వేశా - నితిన్‌

‘‘కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదు. అందుకని, సోమవారం నా పుట్టినరోజు జరుపుకోవడం లేదు. అభిమానులు గమనించాలి అని నితిన్‌ అన్నారు. అలాగే ఏప్రిల్‌ 16న జరగాల్సిన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘రంగ్‌ దే’ మోషన్‌ పోస్టర్‌ని ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.


Advertisement
Advertisement
Advertisement