Jun 16 2021 @ 09:58AM

ఎడిటర్‌కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన నితిన్..?

యూత్‌స్టార్ నితిన్ ఎడిటర్‌కి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడా..అవుననే మాట ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం మాస్ట్రో సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న నితిన్ నెక్స్ట్ సినిమాను కూడా ఓకే చేసినట్టు సమాచారం. మాస్ట్రో తర్వాత పవర్ పేట సినిమా ఒకటి చేయాల్సి ఉంది. చైతన్య కృష్ణ ఈ  సినిమాను తెరకెక్కించనున్నాడు. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు నితిన్. ఈ మూవీ  కాకుండా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్, ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్’ లాంటి చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారబోతున్నాడట. ఈ క్రమంలోనే నితిన్‌కి ఆయన ఒక స్టోరీ చెప్పారని, అది నచ్చడంతో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందట. ప్రస్తుతం ఎస్ఆర్ శేఖర్ 'మాస్ట్రో'కి ఎడిటర్‌గా చేస్తున్నాడు.